vennello brindaavanam
మీ పెట్టుబడికి నందనవనం
రియల్ ఎస్టేట్ రంగం లోనే ఒక సంచలనం ,
ప్రకృతి ప్రేమికులకు సంరంభం ,
అర్ధవంతమైన పెట్టుబడులకు ప్రతిరూపం,
ఆదర్శవంతమైన వెంచర్లకు ఇదే ఆరంభం .
నిజాయితీకి నిదర్శనం , నిబద్దతకు దర్పణం ,
సంస్కృతికి చిహ్నం,సంత్రుప్తికి నిలయం రాయల్ ఆర్చిడ్స్.
హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి ఫై పుణ్యక్షేత్రమైన
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నివాసం యాదగిరి గుట్ట దాటగానే ఉన్నమరో పుణ్య క్షేత్రం కొలనుపాకలో రూపుదిద్దుకుంటున్న మరో అద్భుత భూతల స్వర్గం రాయల్ ఆర్చిడ్స్.
నిన్న గురించి చింతించే వాడు నిరాశావాది, నేటి గురించి తపించేవాడు ఆశావాది, రేపటి గురించి శ్రమించేవాడు మేధావి.ఆ కోవకే చెందుతారు శ్రీ bsn మూర్తి . రియల్ ఎస్టేట్ రంగం లో తనకున్న అపారమైన అనుభవం, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలతో ఉన్న సత్సంభందాలు, సమాజంపై ఉన్న స్పష్టమైన అవగాహనతో ఒక జర్నలిస్ట్ గా వినూత్నంగా ఆలోచించారు.ఓ ఆలోచన, ఓ కొత్త తలంపు, ఓ సరికొత్త కార్యదీక్షా వెరసి
రాయల్ ఆర్చిడ్స్ కు అంకురార్పణ జరిగింది.
వందల ఎకరాల భూమికి జవజీవాలు కల్పించి, దానినొక అద్భుత ఉద్యానవనంగా, ఫల పుష్ప కేంద్రంగా మార్చడానికి నడుముబిగించారు. ఆయన కన్న కలలతో వందల ఎకరాలలో విశాలమైన రోడ్లు వేయించి, లక్షలాది మొక్కలు నాటించి ఆధునిక హరిత వనాన్ని నిర్మిస్తున్నారు.
ప్రకృతి రమణీయ ఫల పుష్ప ఉత్పత్తి కేంద్రంగా మారుస్తున్నారు.
రిసార్ట్స్ ఆంటే కేవలం విందు వినోదాలకు మాత్రమే పరిమితం కాదని, ఒక గొప్ప ఆరోగ్యకేంద్రంగాను, శరీర ధారుడ్య సాధనా కేంద్రంగాను, విశ్రాంతి ఆవాసంగాను తీర్చి దిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.
ముద్దు గుమ్మల్లాంటి ముద్దబంతులు,
మనసులు దోచే మందారాలు,
గుండెను పిండే గులాభీలు,
సమ్మోహితుల్ని చేసే వివిధ వర్ణాల ఫల, పుష్ప, తోయగాలతో
మరో బృందావనానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్నది.
చేయించ గలిగేదే చెప్పి, చెప్పిందే చేసే శ్రీ మూర్తి దీనిని వెంచర్ గానే కాక తన సుమధుర స్వప్నాల సాకారం కోసం ప్రతిస్తాత్మకంగా రూపొందిస్తున్న ఆహ్లాదభరిత మైన నందనవనం ఈ రాయల్ ఆర్చిడ్స్ .
వినియోగ దారుల ఉత్తమాభిరుచికి, ఉజ్జ్వల భవిష్యత్తుకు, చక్కటి లాభార్జనకు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసే హామీగల ప్రాజెక్ట్ ఈ రాయల్ ఆర్చిడ్స్.
Comments
Post a Comment